దుర్గమ్మ హుండీ ఆదాయం మరో రూ.3.19 కోట్లు 

27 Oct, 2021 04:25 IST|Sakshi
కానుకలను లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండో రోజు కూడా కొనసాగింది. మంగళవారం జరిగిన లెక్కింపులో రూ.3.19 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ చెప్పారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన లెక్కింపులో రూ.3,19,39,430 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నగదుతో పాటు 474 గ్రాముల బంగారం, 8.85 కిలోల వెండి లభించిందన్నారు. కాగా, సోమవారం జరిగిన లెక్కింపులో రూ.2,87,83,153 ఆదాయం సమకూరింది. రెండు రోజులలో మొత్తం రూ.6.07 కోట్ల మేర హుండీల ద్వారా దుర్గమ్మకు ఆదాయం వచ్చింది. కానుకల లెక్కింపు బుధవారం కూడా కొనసాగనుంది.   

మరిన్ని వార్తలు