శ్రీశైలంలో దసరా మహోత్సవాలు

26 Sep, 2022 05:59 IST|Sakshi
శ్రీశైల ఆలయం

శ్రీశైలంలో నేటి నుంచి దసరా మహోత్సవాలు

మొదటిరోజు శైలపుత్రి అలంకారంలో భ్రామరి  

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు సోమవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం నిర్వహించనున్నారు.

దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు