మ‌హిళా భ‌ద్ర‌తకు మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు : డీజీపీ

31 Aug, 2020 14:58 IST|Sakshi

సాక్షి, అమ‌రావ‌తి :  మహిళలపై సైబర్‌ నేరాల నిరోధానికి తీసుకొచ్చిన‌ ఈ-ర‌క్షాబంధ‌న్ బాగా పాపుల‌ర్ అయ్యింద‌ని సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్  తెలిపారు. దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు  ఇప్ప‌టికే మీమ్స్, యూట్యూబ్ మాధ్య‌మాల ద్వారా 6 కోట్ల‌మంది వీక్షించార‌ని అయితే ప‌లాస్ సినిమాకు వ‌చ్చిన పాపులారిటీ ఈ-రక్షాబంధన్‌కు సైతం రావాల‌న్నారు.  సైబర్ క్రైమ్ జరిగినపుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలిపాం.  police4u.com ద్వారా ఎవ‌రైనా  కంప్లైంట్ ఇవ్వచ్చు.  ఆన్ లైన్ క్లాసులు, బ్యాంకింగ్ కోసం ఎక్కువమంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే బ్యాంకు వివరాలు ఏ ఆన్ లైన్ గేమ్‌లోనూ  ఇవ్వద్దు.  80% మంది సైబర్ క్రైమ్ ద్వారా డబ్బు పోగొట్టుకున్నారు. ఇప్ప‌టికే  2,28,982 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువ‌కులే అధికం.  సైబర్ క్రైమ్ విషయంలో పోలీసు స్టేషన్‌కు  వెళ్ళాలని చాలామందిలో అవగాహన ఉందని సునీల్ కుమార్  వెల్ల‌డించారు. (ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం)

భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు
మహిళలకు, పిల్లలకు సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడ‌మే  ఈ-రక్షాబంధన్ ఉద్దేశ‌మ‌ని   డీజీపీ గౌతమ్ స‌వాంగ్ అన్నారు.  సైబర్ స్పేస్ లో ఎక్కువగా ఉంటున్నందున ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ అవగాహన కార్యక్రమాలలో భాగస్వాములు కావాల‌న్నారు. దిశ ఒక చట్టమే కాకుండా, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు కలిగి ఉందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్తులో మ‌హిళ భ‌ద్ర‌త కోసం మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు తీసుకొస్తామ‌ని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కాలేజీలు, స్కూళ్ళ విద్యార్ధినుల చేసిన  అభిప్రాయాలు  అభినందనీయమ‌న్నారు. సమాజంలో ఉన్న అన్ని‌ వర్గాల‌ వారూ ఈ-రక్షాబంధన్ ద్వారా లబ్ధి పొందారని వివ‌రించారు. 

సైబర్ బుల్లింగ్ ఎక్కువ‌గా ఉంది : స‌మంత‌
మహిళలను, పిల్లలను ఆన్ లైన్ మోసాల నుంచీ రక్షించడం చాలా అభినందనీయమ‌న్నారు సినీన‌టి అక్కినేని స‌మంత‌. ప్ర‌స్తుతం సైబర్ బుల్లింగ్ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్న స‌మంత‌..దీని అడ్డుక‌ట్ట వేయ‌డంలో ఈ- రక్షాబంధన్ విజ‌య‌వంత‌మైంద‌న్నారు.  ఈ-రక్షాబంధన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం పట్ల సంతోషిస్తున్నాను.ఈ  కార్యక్రమం స్త్రీలకు ఒక సోదరుడిలా పనిచేసిందని స‌మంత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఇచ్చిన యూట్యూబ్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంద‌ని   టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ,  భారత మహిళా క్రికెటర్ రావి కల్పన తెలిపారు. సీఎం జ‌గ‌న్ ఆలోచనల నుంచి పుట్టిన దిశా చట్టం మహిళలకి కొండంత భరోసా ఇస్తోందని ఈ సంద‌ర్భంగా ఆమె కొనియాడారు. 


 


 

మరిన్ని వార్తలు