AP: గులాబ్ తుపాన్‌తో పలు రైళ్లు రద్దు

26 Sep, 2021 11:27 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘గులాబ్ తుపాన్’ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 310కిలో మీటర్లు, కళింగపట్నానికి 380 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ‘గులాబ్‌’ తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి.

పలు రైళ్ల రాకపోకలు మల్లింపు, కొన్ని రైళ్లను రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. 08463 భువనేశ్వర్-కే.ఎస్.ఆర్ బెంగళూరు స్పెషల్ ట్రైన్, 02845 భువనేశ్వర్- యస్వంత్ పూర్ స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేసినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు