East Godavari: అరుదైన ముత్యాల శంఖం.. రూ. 18 వేలు!​

30 Jun, 2021 19:13 IST|Sakshi

కొత్తపల్లి/తూర్పు గోదావరి జిల్లా: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన ముత్యపు శంఖం దొరికింది. తొండంగి మండలం హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు గంటా జగన్నాథం సముద్రంలో వేటకు వెళ్లగా ఆయన వలకు ఈ భారీ శంఖం చిక్కింది. 

కాగా అరుదైన ఈ ముత్యాల శంఖాన్ని అమీనాబాదు హార్బర్‌లో ఉప్పాడకు చెందిన వ్యాపారులు రూ. 18 వేలు వెచ్చించి ఇటీవల కొనుగోలు చేశారు. ఈ శంఖాన్ని మెలో మెలో పేరుతో పిలుస్తారని మత్స్యశాఖాధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు