ట్రెండ్‌ మారింది గురూ; ఏం కావాలో మీరో చెప్పండి!

3 Mar, 2021 14:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తూర్పుగోదావరి: గతంలో ఎన్నికలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవడం. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రస్తుత ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎవరు సరఫరా చేసినా వారి సభ్యత్వం రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వార్డుల్లో సమస్యలు పరిష్కారంపై అభ్యర్తల నుంచి కచ్చతమైన హామీలు రాతపూర్వకంగా తీసుకోవాలని మున్సిపల్‌ ఓటర్లు భావిస్తున్నారు. మీ వార్డుకు ఏం కావాలో మీరో చెప్పండి’ అని అభ్యర్థులు చెబుతుంటే..ఏదిచ్చినా ముందే అంటున్నారు ఓటర్లు. నెగ్గకపోతే తర్వాత సంగతేమిటని అభ్యర్థులు అడుగుతుంటే ఒప్పంద పత్రాలు రాసుకుందాం అని ఓటర్లు బదులిస్తున్నారు. అభ్యర్థుల్లో ఎవరిని బలపర్యాలనే చర్య జరిగాక, అతడి నుంచి ఏ హామీ తీసుకోవాలి, ఏ పనులు చేయించుకోవాలన్న వాటిపై ఓటర్లు వార్డుల్లో సుదీర్ఘ చర్చలు సాగిస్తున్నారు. తమ ప్రాంతంలో గుడి కట్టాలని కొందరు, కుల సంఘాల భవనాలకు నిధులివ్వాలని మరికొందరు ఇలా తమకు తోచినట్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు రాతపూర్వక ఒప్పందాలుచేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు