ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం భేష్‌ 

23 Sep, 2023 05:57 IST|Sakshi
చీమకుర్తి గురుకుల పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న రాక్వెల్‌ ఫ్రాఫ్‌ 

ఆస్ట్రేలియా గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ సీఈవో రాక్వెల్‌ ఫ్రాఫ్‌ 

ఒంగోలు సెంట్రల్‌: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం చాలా బాగుందని, ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అస్ట్రేలియా గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్స్‌ సీఈవో రాక్వెల్‌ ఫ్రాఫ్‌ అన్నారు. ఆమె శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు.

డీఈవో వీఎస్‌ సుబ్బారావు, పరిషత్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(పీఈవో) సోమా సుబ్బారావుతో కలిసి జిల్లాలోని పలు పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం, రామచంద్ర మిషన్‌ను రాక్వెల్‌ ఫ్రాఫ్‌ సందర్శించారు.

నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి, విద్యార్థులకు అందించిన యూనిఫాం, షూ, పుస్తకాలు, కేరీర్‌ గైడెన్స్, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, మార్గదర్శినిపై విద్యాశాఖ చేస్తున్న కసరత్తును పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రూపు సంతరించుకోవడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. ముందుగా ఆమెకు విద్యాశాఖ అధికారులు, రోటరీ క్లబ్‌ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు