YS Jagan: విద్యారంగం.. పురోగమనం

5 Jun, 2021 04:23 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ సారథ్యంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధి

ఆయన ఓ గొప్ప విజనరీ.. అద్భుతాలు చేస్తున్నారు 

విద్యారంగానికి 17శాతానికి పైగా నిధులు 

సర్కారు సంస్కరణలతో ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి భారీగా వలసలు 

ఓపెన్‌ మైండ్స్‌ సంస్థ వర్చువల్‌ సమావేశంలో నిపుణులు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత విద్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, అనేక విప్లవాత్మక మార్పులకు ఇవి నాంది పలుకుతున్నాయని పలువురు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం సీఎంకు రెండు కళ్లు అని వారు అభివర్ణించారు. స్వచ్ఛంద సంస్థ ‘ఓపెన్‌ మైండ్స్‌’ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ముఖ్యమంత్రి జగన్‌ రెండేళ్ల పాలన–విద్యారంగంలో వినూత్న మార్పులు’ అంశంపై పలువురు విద్యారంగ నిపుణులతో వర్చువల్‌ సమావేశం జరిగింది. వక్తలు ఏమన్నారంటే.. 

నిధుల కేటాయింపు ఇంగ్లండ్‌ కన్నా ఇక్కడే ఎక్కువ 
విద్యారంగానికి వైఎస్‌ జగన్‌ 17 శాతానికి పైగా నిధులు కేటాయిస్తున్నారు. ఇంగ్లండ్‌లో కన్నా ఈ కేటాయింపులు అధికం. విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఉన్నత, పాఠశాల విద్యకు వేర్వేరుగా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్లను ఏర్పాటుచేశారు. వీటన్నింటి ఫలితాలు రావడం మొదలు పెడితే ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్‌ అవుతుంది. 
– జస్టిస్‌ ఈశ్వరయ్య, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ 

సీఎం చాలా అద్భుతాలు చేస్తున్నారు 
వైఎస్‌ జగన్‌ పథకాలన్నీ ఎంతో మేలు చేసేవి. అమ్మఒడిని ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తే అవి మరింత బలోపేతమవుతాయి. నాడు–నేడుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఏర్పడి చూడముచ్చటగా మారాయి. పాఠశాల టీచర్ల వ్యవస్థ బాగుంది. వర్సిటీ అధ్యాపకులపై ఏటా అసెస్‌మెంటు జరగాలి. సీఎం జగన్‌ చాలా అద్భుతాలు చేస్తున్నారు.  
– ప్రొ. వెంకట్రామిరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్‌

అమ్మఒడితో హాజరు శాతం పెరిగింది 
అమ్మఒడితో డ్రాప్‌ అవుట్లు బాగా తగ్గాయి. గతంలో 70 శాతం హాజరుండగా ఇప్పుడు 90 శాతానికి పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది చేరికలు పెరిగాయి. 
– డాక్టర్‌ బి.ఈశ్వరయ్య, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యుడు 

‘నాడు–నేడు’అత్యుత్తమ పథకం 
నాడు–నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకం. జగనన్న గోరుముద్ద, విద్యాకానుకతో విద్యార్థుల్లో ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, చదువులపై ఆసక్తి పెరిగింది. హ్యూమన్‌ కేపిటల్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. 
– ప్రొ. నారాయణరెడ్డి, విక్రమ సింహపురి వర్సిటీ ఫౌండర్‌ రిజిస్ట్రార్ 

16 ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటు గొప్ప విషయం 
విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు లేవు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలు పెట్టడానికి నిర్ణయించి నిధులు కేటాయించడం గొప్ప విషయం.  
– జి. శాంతారావు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ 

మాజీ డైరెక్టర్‌ 45వేల స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ 
రాష్ట్రంలో స్టేట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుచేయడం సంతోషించదగ్గ విషయం. 45 వేల పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుచేయించడం గొప్ప విషయం. ఏయూ, ఎస్వీయూ, నాగార్జున వర్సిటీలు మరింత ప్రమాణాలతో ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్సులోకి వస్తాయని ఆశిస్తున్నాం.  
– ప్రొ.నారాయణరావు, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ 

మరిన్ని వార్తలు