Fact Check: అది రోత రాతల వంటకం 

18 Feb, 2023 06:57 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని ఈనాడు వండి వారుస్తున్న అసత్య కథనాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల డైట్‌ చార్జీలపై ఆ పత్రిక వండిన రాతల వంటకం రోత పుట్టించేలా ఉంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ఆ క్షుద్ర పత్రిక ‘మాటల వంటకమే’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని అచ్చోసింది. నిజానికి.. ఆ వసతి గృహాలపై చంద్రబాబు సవతి ప్రేమ  గత పరిస్థితిని గమనించిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

పైగా బోలెడు బకాయిలు తన హయాంలో చెల్లించలేదు. నిజానికి.. ఈ డైట్‌ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇవి ఆమోదించే దశలో ఉండగా ఈనాడు ఈ వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి ఉద్దేశపూర్వకంగా, ఎప్పటిలాగే తన కడుపుమంటను తీర్చుకుంది. దీనిని ఖండిస్తూ సాంఘిక సం­క్షేమ శాఖ సంచాలకుడు కె. హర్షవర్థన్‌ శుక్ర­వారం వాస్తవాలు వెల్లడించారు. అవి ఏమిటంటే.. 

2012లో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లకు డైట్‌ ఛార్జీలు పెంచారు.
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు 2018 వరకు వాటిని పెంచాలనే ఆలోచన చేయలేదు.  
కానీ, 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 జూలై నుంచి పెంచింది. అంటే.. ఈ చార్జీలు పెంచింది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే.  పైగా ఇందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేయలేదు. ఫలితంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.  
2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. బాబు మిగిల్చిన బకాయిల మొత్తం రూ.132 కోట్లను క్లియర్‌ చేసింది. 
ఆ తర్వాత డైట్‌ ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని 2022 ఆగస్టులో సీఎం జగన్‌ అధికారులను ఆదేశించగా వారు పెంపు ప్రతిపాద­నలను ప్రభుత్వానికి సమర్పించారు. 

 దీని ద్వారా 5.92 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, డైట్‌ ఛార్జీల కోసం రూ.755 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు. తాజా పెంపు ప్రతిపాదనలతో ప్రభుత్వంపై అదనపు ఆరి్థక భారం రూ.110 కోట్లకు పైగానే ఉంటుంది. ఆరి్థకపరమైన భారంతో కూడుకున్న ఈ అంశంపై ఆయా విభాగాల వివరణాత్మక పరిశీలన, సంప్రదింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ ఫైలు ఆమోదించే దశలో ఉంది.  
ఇవేకాక.. నాడు–నేడు కింద రాష్ట్రంలో వివిధ రకాల 3,013 సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలను మూడు దశల్లో రూ.3,300 కోట్ల అంచనాతో అభివృద్ధి చేసేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి.  
ఇందులో ప్రధానంగా టాయిలెట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ఎల్‌ఈడీ లైట్లు, మంచినీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, వంటగది ఆధునీకరణ, ప్రహారీ గోడలు, దోమల మ్యాట్‌లు, స్మార్ట్‌ టీవీ, క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు, డ్రైనేజీ వ్యర్థ జలాలను సురక్షితంగా పారవేయడంతో పాటు పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 
ఈ సమయంలో డైట్‌ ఛార్జీల పెంపుదల ఫైల్‌ క్లియరెన్స్‌ అవకాశం ఉందనే విషయాన్ని మరుగున పరిచి ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం సరికాదు.  బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో బురదజల్లే రాతలు రాయడం దుర్మార్గం.   

మరిన్ని వార్తలు