అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉండదు

30 Sep, 2021 03:40 IST|Sakshi

సాక్షి, అమరావతి/విశాఖ దక్షిణ: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్‌ పశ్చిమ ప్రాంతాల్లో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. రుతు పవనాల కదలిక జోరుగా ఉందని, ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు