ఎనిమిది స్పెషల్ కోర్టులు మంజూరు

25 Aug, 2020 18:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆడపిల్లల రక్షణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది స్పెషల్‌ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (పోక్సో) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్న చోట కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప , అనంతపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది. జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు పనిచేయనున్నాయి. కాగా మహిళ రక్షణ కొరకు ఏపీ సర్కార్‌ ఇదివరకే దిశ చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు