ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ..

2 Feb, 2021 16:30 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే, ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ భిన్నస్వరాలను వినిపించారు‌. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన.. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అరోగ్యకరమని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు జరిగితేనే గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయనేది పిడివాదమని అభిప్రాయపడ్డారు. 

ప్రజాస్వామ్యం లో భిన్నస్వరాలు వినబడాలని, అప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుందని, ఇదే రాజ్యాంగం బాధ్యత అని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు గ్రామాల్లోని ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు ఎన్నికల నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన గొల్లలగుంట ఘటనను ప్రస్థావిస్తూ.. ఆ ఘటన చాలా బాధాకరమని, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు