శ్రీలంక మహిళను భర్త మోసం చేస్తే.. మధ్యవర్తితం పేరుతో టీడీపీ నేత కన్నేశాడు

3 May, 2022 19:58 IST|Sakshi

సాక్షి, ఏలూరు: ఆమెది ఈ దేశం కాదు. అయితే కట్టుకున్న వాడికోసం దేశం కాని దేశం నుంచి వచ్చి కలహాల కాపురంలో కష్టాలు ఈదుతోంది. మధ్యవర్తిత్వం నెపంతో వచ్చిన ఓ పచ్చ కామాంధుడి చేతిలో నలిగిపోతోంది. వివరాల్లోకెళ్తే.. శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి, ఏలూరు జిల్లా వీరవాసరం మండల పడమటి పాలెంకు చెందిన పితాని వెంకట సత్యనారయణను 2011లో కువైట్‌లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వారు కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్నారు. అనంతరం పడమటిపాలెం వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. అయితే భర్త ఆమెకు తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా సత్యనారాయణ కుటుంబ సభ్యులు  కొంత బంగారంతో పాటు, ఐదు లక్షల నగదు తీసుకుని తనపై దాడి చేశారని విజయలక్ష్మి వాపోతోంది. 

అయితే మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరవల్లి చంద్రశేఖర్‌ 2021లో అత్త ఇంటివారి నుంచి రెండున్నర లక్షలు ఇచ్చే విధంగా సెటిల్‌మెంట్‌ చేశాడని బాధితురాలు తెలిపింది. కానీ మధ్యవర్తిత్వం చేసి రూ.25వేలు ఇప్పించాడు. మిగిలిన సొమ్ము ఇప్పించమని అడగగా ఇంటికి పిలిచి తనను లోబరుచుకోవడానికి యత్నించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేత చంద్రశేఖర్‌ లైంగిక వేధించి, బెదిరించాడని శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: ('డబ్బే ముఖ్యమని హింసించారు.. నన్ను అర్థం చేసుకోలేదు')

మరిన్ని వార్తలు