ఈ నెల 30న ఏలూరు మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

23 Jul, 2021 21:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు రాష్ట్రంలోని 11 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపికకి ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. 30వ తేదీ ప్రత్యేక సమావేశాలకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, కార్పోరేషన్ అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది.

ఎంపికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లకి ఈ నెల‌ 26 లోపు సమాచారమివ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించుకునేలా ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ల ఎంపిక చేపట్టాలని ఎస్‌ఈసీని ప్రభుత్వం‌ కోరడంతో ప్రత్యేక సమావేశం నిర్వహణకి నోటిఫికేషన్ జారీ చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు