‘ఉద్యోగ సంఘాలు రాజకీయ ఉచ్చులో పడోద్దు’

29 Sep, 2020 14:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం అప్పటి ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యోగులని మోసం చేశారని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులను మోసం చేసిన నాటి ప్రభుత్వం దిగిపోవాలని అంతా కోరుకున్నామన్నారు. కరోనా ప్రభావం ఉద్యోగుల ఆర్థిక అంశాలపై కూడా తీవ్రంగా చూపిస్తోంది. కరోనా కారణంగా నిలిపిన మార్చి, ఏప్రిల్‌ నెలల జీతాల బాకాయిలను ఒక నెల పెన్షన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. కనీసం మూడు డీఏలు విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించే డీఏకి.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏకి సంబంధం లేదు, కానీ ఆర్థిక శాఖాధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పీఆర్‌సీ కమీషన్‌ గడువు పెంచకుండా వెంటనే రిపోర్టు తెప్పించుకుని ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా పదవీ విరమణ పోందిన ఉద్యోగులకు కూడా వెంటనే చెల్లింపులు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ఏడాది కాలంగా ప్రజల ముంగిటకి ప్రభుత్వ సేవలు అందాయన్నారు. పరీక్ష ద్వారా ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య వేతన వ్యత్యాసాలను తొలగించాలని, అన్ని ప్రభుత్వం శాఖలలో మినిమం​ టైం స్కేల్‌ అమలు చేయాలన్నారు. ఉద్యోగులు సమస్యలపై ఈ వారంలో సీఎం వైఎస్‌ జగన్‌ కలవడానికి అపాయింట్‌ మెంట్‌ అడిగామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్యోగుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని, తమ ఆర్థిక పరమైన డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు రాజకీయ ఉచ్చులో పడోద్దని ఆయన హెచ్చారించారు

మరిన్ని వార్తలు