దేవుడు భూమిని మింగేస్తున్నారు..కాపాడండి

11 Aug, 2021 09:27 IST|Sakshi
పలాసలో ప్రైవేటు వ్యక్తుల పేరున రికార్డుల్లోకి ఎక్కిన దేవాలయ భూములివే

టీడీపీ హయాంలో చెలరేగిపోయిన భూబకాసురులు

రికార్డులను మార్చేసిన ఘనులు

పలాసలో యథేచ్ఛగా సాగిన భూబాగోతం

భూముల విలువ రూ. 1000కోట్ల పైమాటే   

పలాసలో భూముల రేట్లతో పాటు భూదందాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డులు మార్చేసి విలువైన భూములు కొట్టేయడానికి కొందరు మాస్టర్‌ ప్లాన్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ క్షుద్ర ప్రయత్నాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను కాజేయడానికి చూస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో భూ బకాసురుల ఆకలికి దేవుడి భూములు స్వాహా అయిపోయే లా ఉన్నాయి. బృందావన స్వామి, మదనమోహన స్వామి, వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి ఆలయాలకు చెందిన దాదాపు రూ.వెయ్యి కోట్ల వి లువైన భూములపై కొందరి కన్ను పడింది. ఇప్ప టికే ఈ ఆలయాలకు సంబంధించిన కొన్ని భూ ములు ప్రైవేటు వ్యక్తుల పేరున అడంగల్‌లోకి ఎక్కిపోయాయి. కొన్నేళ్ల కిందటే ఇక్కడ రికార్డుల మా   ర్పిడి జరిగిపోయింది. టీడీపీలో కీలక నేతలు సూ త్రధారులుగా వ్యవహరించారు. అధికారులు, అక్రమార్కులు కుమ్మక్కై దేవాలయ భూములు కొట్టేసేందుకు స్కెచ్‌ వేశారు. ఏ మాత్రం అలసత్వం వ హించినా దాదాపు 25ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తుల పరమవుతాయి. 

భూ దోపిడీ.. 
పలాసలో భూదందాలకు అంతులేకుండా పోయింది. దీనిపై ‘సాక్షి’ కథనాలను కూడా ప్రచురించింది. వీటిని శోధించే పనిలో ఉండగా దేవాలయాల భూ ముల కొట్టేసే పన్నాగం వెలుగు చూసింది. ఇక్కడ బృందావన స్వామి, మదనమోహనస్వామి, వేణుగోపాలస్వామి, జగన్నాథస్వామి దేవాలయాలకు సంబంధించిన 24.58 ఎకరాల భూములు ఉన్నా యి. పట్టణం నడిబొడ్డున, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదు రుగా ఇవి ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలకు పు రోహిత ఇనాం భూములుగా ఉన్న వాటిని వ్యూహాత్మకంగా ప్రైవేటు వ్యక్తుల పేరున అడంగల్‌లోకి ఎక్కించేశారు.

కొందరు అధికారులు వత్తాసు పలకడంతో కొన్నింటికి డిజిటల్‌ సిగ్నేచర్‌ కూడా అయిపోయింది. మరికొన్నింటికీ డిజిటల్‌ సిగ్నేచర్‌లో పెండింగ్‌లో పెట్టి ఉంచారు. మళ్లీ అధికారంలోకి వస్తే కొట్టేయవచ్చని ఎన్నికల ముందు పావులు కదిపారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో వారి ఆట లు సాగలేదు. చాలావరకు డిజిటల్‌ సిగ్నేచర్‌ పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే, వాటినే పట్టుకుని ప్రస్తుతం కూడా లావాదేవీలు సాగిపోతున్నాయి. వందలకోట్లరూపాయల విలువైన భూములను దర్జాగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు.  

అధికారులేం చేస్తున్నారు..? 
దేవాలయాల భూములు అధికారుల కళ్ల ముందే ప్రైవేటు వ్యక్తుల పేరున రికార్డుల్లోకి ఎక్కిపోయా యి. వారసత్వం, డీ పట్టా భూముల కింద కొన్ని, కొనుగోలు కింద మరికొన్ని భూములు ప్రైవేటు వ్య క్తుల పేరున అడంగల్‌లో నమోదయ్యాయి. ఇంత జరిగినా అధికారులు చోద్యం చూడడం తప్ప ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి పురోహిత ఇనాం భూములు వారసత్వం కింద వ చ్చే అవకాశం లేదు. అలాగే, దేవాలయాల భూ ములను డీ పట్టాల కింద ఇవ్వడానికి లేదు. దేవాలయాల భూములకొనుగోలు కూడా నిషేధం.

కానీ ఇక్కడ నిబంధనలన్నీ నీరుగారిపోయాయి. పక్కా గా రికార్డుల్లో వారసత్వం, కొనుగోలు, డీ పట్టా కింద ప్రైవేటు వ్యక్తుల పేరిట రాసేశారు. నిషేధిత భూ ముల జాబితాలో ఉన్న సర్వే నంబర్లపైన కూడా లావాదేవీలు జరిగిపోయాయి. ఇప్పుడవి చైన్‌ సిస్టమ్‌లా చేతులు మారిపోతున్నాయి. అనధికారికంగా వందల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు మేలుకోకుంటే దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు దేవుడికి కాకుండాపోతాయి.   

మరిన్ని వార్తలు