ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి

27 Jun, 2021 04:42 IST|Sakshi
మాట్లాడుతున్న జస్టిస్‌ కృష్ణమోహన్‌

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

నెహ్రూనగర్‌ (గుంటూరు): ప్రతి పౌరుడు సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ అన్నారు. జమ్మూ అండ్‌ కశ్మీర్‌ పీస్‌ ఫౌండేషన్‌ గ్లోబల్‌ ఏపీ చాప్టర్‌ కార్యవర్గ ఎన్నిక శనివారం గుంటూరులోని బ్రాడీపేటలో జరిగింది. దీనికి హాజరైన జస్టిస్‌ మాట్లాడుతూ..పీస్‌ ఫౌండేషన్‌ ద్వారా జమ్మూ అండ్‌ కశ్మీర్‌లోని అనాథలకు, వృద్ధులకు, వితంతువులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

వారి సేవలను ఏపీలో కూడా ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఏపీ చాప్టర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ..జమ్మూ అండ్‌ కశ్మీర్, లడ్హాఖ్‌లు భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయని, అక్కడ చేస్తోన్న సేవలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ చాప్టర్‌ అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు