టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి తోచర్‌ రాజీనామా

10 Jan, 2021 08:01 IST|Sakshi
చంద్రబాబు చర్చిలో ప్రార్థన చేస్తున్న ఫొటోను చూపుతున్న ఫిలిప్‌ సి థోచర్‌   

సాక్షి, గుంటూరు/విజయవాడ: క్రైస్తవ మతం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి తోచర్‌ శనివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు రాజీనామా పత్రాన్ని పంపారు. అనంతరం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మెడలో శిలువ వేసుకుని బైబిల్‌ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. చదవండి: (పేదలకు పథకాలందే వేళ ఎన్నికల కోడ్‌ తెస్తారా!)

రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలకు క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. క్రైస్తవులను అవమానాలకు గురిచేస్తున్న టీడీపీ,  చంద్రబాబు వైఖరి నచ్చక పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా,  ఫిలిప్‌ సి తోచర్‌ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఆంగ్లో ఇండియన్‌ కోటాలో నామినేటెడ్‌ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. చదవండి: (పక్కా కార్యాచరణతో ముందుకు)

మరిన్ని వార్తలు