ఆయేషా మీరా కేసులో సాక్షుల విచారణ

7 Sep, 2023 03:40 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ఆయేషా మీరా హత్య కేసులో పలువురు సాక్షులను సీబీఐ అధికారులు బుధవారం విచారించారు. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. 16 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నేటికీ నిందితులను పట్టుకోలేకపోవడంతో ఆమె తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసును అనేక కోణాల్లో విచారించారు.

2019లో ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించారు. అసలు నిందితుల కోసం విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ఆయేషా మీరా కేసును వాదించిన న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు, తాజాగా ఆయేషా మీరా కేసులో పంచనామా నిర్వహించిన కృష్ణప్రసాద్‌తో పాటు పలువురు సాక్షులను అధికారులు విచారించారు. కేసు విచారణలో తాము ఎప్పుడు పిలిచినా రావాల్సిందిగా అధికారులు సాక్షులకు సూచించారు. 

మరిన్ని వార్తలు