AP: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు కసరత్తు

1 Feb, 2022 05:41 IST|Sakshi

మరోవైపు 11,425 పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం

ఫిబ్రవరి చివరినాటికి బదిలీలు, నియామకాలు

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలో అన్ని క్యా డర్లలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నేటి (మంగళవారం) నుంచి ఈ నెలాఖరు వరకు బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. బదిలీల విషయమై డీహెచ్, డీఎంఈ, ఏపీవీవీపీ, ఆయుష్‌ కమిషనర్, ఇతర అధికారులతో వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ సమీక్షించారు. ప్ర భుత్వం నిర్దేశించిన గడువులోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఆన్‌లైన్‌లో బ దిలీలు చేపట్టేందుకు ప్రత్యేకంగా వెబ్‌ అప్లికేషన్‌ను రూపొందించారు. రాష్ట్ర, రీజనల్, జిల్లా కమిటీల వారీగా అధికారులు లాగిన్‌ అవడానికి వీలు కల్పించారు.

వెబ్‌ అప్లికేషన్‌ పనితీరు, ఉద్యోగుల వివరా ల నమోదు, తదితర అంశాలపై జిల్లాల పరిపాలన విభాగం ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఉన్నతాధికారులు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్‌గా సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరికి బదిలీ తప్పనిసరి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీలోపు ఉద్యోగ విరమణ చేసే వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.

వీరికి అభ్యర్థన మేరకు మాత్రమే బదిలీలు ఉంటాయి. ఈ కోవకు చెందిన ఉద్యోగులను మినహాయించి తప్పనిసరి బదిలీకి అర్హులైన ఉద్యోగుల స్థానాలను ఖాళీల రూపంలో వెబ్‌ అప్లికేషన్‌లో ప్రదర్శించనున్నారు. మరోవైపు వైద్య, ఆరోగ్యశాఖలో 11,425 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొన్ని పోస్టులు ప్రత్యక్షంగా, మరికొన్ని పదోన్నతుల ద్వారా భర్తీచేస్తున్నారు. 

మరిన్ని వార్తలు