వైఎస్సార్‌ కంటి వెలుగుతో ఎందరికో చూపు

14 Nov, 2021 04:47 IST|Sakshi
జర్నల్‌ను ఆవిష్కరిస్తున్న వీసీ శ్యామ్‌ప్రసాద్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ వెల్లడి 

బెజవాడలో నేత్ర వైద్యుల సదస్సు 

లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు కోల్పోయిన ఎంతో మందిలో వెలుగులు నింపినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ పి.శ్యామ్‌ప్రసాద్‌ చెప్పారు. ఏపీ ఆప్తాల్మిక్‌ సొసైటీ (ఏపీవోఎస్‌) ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 6వ రాష్ట్ర నేత్ర వైద్యుల సదస్సు ఐకాన్‌–2021ను శనివారం డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

నేత్ర వైద్యంలో ఆధునిక పద్ధతులను వివరిస్తూ ముద్రించిన జర్నల్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా నేత్ర వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్‌ నమ్రతా శర్మ, ఏపీ ఆప్తాల్మిక్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.పర్నికుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్‌.విష్ణువర్ధన్‌రావు, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ డాక్టర్‌ ఎ.శ్రీహరి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జీఆర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు