వాట్సాప్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్‌ ప్రచారం.. నమ్మి మోసపోవద్దంటున్న ఏపీఎస్‌ఆర్టీసీ

21 Feb, 2023 17:51 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్  అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించింది ఏపీఎస్‌ఆర్టీసీ. తాము ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఏపీఎస్సార్టీసీలో డ్రైవర్ , కండక్టర్ ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసినట్లు  పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కొందరు. పైగా వాట్సాప్‌లో Apsrtc వెబ్ సైట్ డొమైన్ ను యాడ్ చేస్తూ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేశారు ఆ అగంతకులు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించింది ఆర్టీసీ. అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటించి రిలీజ్‌ చేస్తామని స్పస్టం చేసింది. 

మరిన్ని వార్తలు