-

గుంటూరు: డొంక రోడ్డు విస్తరణ.. అభివృద్ధికి యెల్లో మీడియా వంక!

24 Nov, 2022 17:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: యెల్లో మీడియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అడ్డగోలు అసత్యాలను తెర మీదకు తీసుకొస్తోంది. తాజాగా గుంటూరు చంద్రయ్య కాలనీలో కూల్చివేతల కలకలం అంటూ జనాల్ని తప్పుదోవ పట్టించే ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అయితే.. 

ఆ కూల్చివేతల వెనుక ఉన్న వాస్తవాల్లోకి వెళ్తే.. గుంటూరు డొంక రోడ్డు కూడలిలో ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కారానికి డోంక రోడ్డు విస్తరణ చేపట్టిన అధికారులు.. ఇందుకు అంగీకరించిన వారి ప్రహారీ గోడలను మాత్రమే కూల్చారు. వీరికి నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు కూడా. మరోవైపు రోడ్డు ఆక్రమించి.. నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగించారు. పరిహారానికి అనర్హులైన వాళ్లు చేసే రాద్ధాంతాన్నే ఇప్పుడు యెల్లో మీడియా హైలెట్‌ చేసింది. 

బుధవారం జరిగిన కూల్చివేతల్లో కేవలం పది కాంపౌండ్‌ వాల్స్‌ మాత్రమే పోయాయి. అదీ వాళ్ల అంగీకారంతోనే. ఇక కూల్చివేతలను అడ్డుకున్న వాళ్లలో అత్యధికులు అక్రమదారులేనని, రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకుండా.. నష్టపరిహారానికి అనర్హులుగా మరికొందరు తేలారని గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. అంతేకాదు.. ఇవి హఠాత్తుగా చేపట్టిన కూల్చివేతలనే ప్రచారాన్ని సైతం అధికారులు తిప్పి కొట్టారు.

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి టూ టౌన్‌, ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ వన్‌ టౌన్‌ మధ్య కీలకమైన ఈ రోడ్డు అభివృద్ది పనుల ప్రతిపాదన పదేళ్ల కిందటి నాటిదేనని ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులు గుర్తు చేస్తున్నారు. పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, చంద్రయ్య కాలనీలో రోడ్డు విస్తరణకు 2015లోనే అధికారులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి ప్రహరీలు, రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు తొలగించారు అని అధికారులు చెప్తున్నారు. అయితే.. నోటీసులు ఇవ్వకుండా నోటీ మాట మీదే కూల్చివేతలు చేపట్టారంటూ అసత్యాలను ప్రచారం చేస్తోంది.

మరిన్ని వార్తలు