సీనియర్‌ పాత్రికేయుడు పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూత

18 Sep, 2021 08:16 IST|Sakshi
పిళ్లా వెంకటేశ్వరరావు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ పాత్రికేయుడు, పీపుల్స్‌వార్‌ సిద్ధాంతకర్తల్లో ఒకరైన పిళ్లా వెంకటేశ్వరరావు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. 1980లలో ఆయన పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. విప్లవోద్యమంలో అధ్యాపకుడిగా, ఉద్యమ నిర్మాణ కర్తగా ఏళ్లపాటు పనిచేశారు.

2004 ఎన్నికల సమయంలో లొంగిపోయి సాధారణ జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత పత్రికారంగంలో చురుగ్గా పనిచేశారు. ‘సాక్షి’పత్రికలో పదేళ్లపాటు సేవలందించారు. ఈ దశాబ్ద కాలంలో పత్రికారచనలో తనదైన ముద్ర వేశారు. తర్వాత కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బందులు పడి పాత్రికేయ వృత్తికి కూడా దూరమయ్యారు. 

చదవండి: వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు 

మరిన్ని వార్తలు