Manisha: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ

7 Jul, 2022 07:17 IST|Sakshi
తండ్రి సూర్యనారాయణరెడ్డితో మనీషా

రాప్తాడు (అనంతపురం): మండలంలోని రైతు బిడ్డ గ్రూప్‌–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ పోస్టుకు ఎంపికయ్యారు. వివరాలు.. బుక్కచెర్లకు చెందిన రైతు గొర్ల సూర్యనారాయణరెడ్డి, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారై గొర్ల మనీషా గ్రూప్‌–1లో సత్తా చాటి ఆర్టీఓగా ఎంపికయ్యారు. కాగా, ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాప్తాడు మండలంలోని ఎల్లార్జీ స్కూల్‌లో జరిగింది.

6 నుంచి 10వ తరగతి వరకూ అనంతపురంలోని సీవీఆర్‌ మెమోరియల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదివారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ అకాడమీలో బీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2018లో గ్రూప్‌–1 పరీక్ష రాశారు. ఈ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. అమ్మ, నాన్న కోరిక మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.   

చదవండి: (ఆర్బీకే ఓ అద్భుతం!)  

మరిన్ని వార్తలు