పొట్టేలుతో గుంటక తోలిన రైతు

18 Jul, 2021 08:14 IST|Sakshi

ఎమ్మిగనూరు రూరల్‌: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటగిరిలో రైతు పింజరి రంజాన్‌ తన పత్తి పొలంలో పొట్టేలుతో గుంటక తోలాడు. రంజాన్‌ తనకు ఉన్న ఎకరం పొలంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. వర్షాలు బాగా కురవడంతో పత్తి చేలో గడ్డిమొక్కలు పెరిగాయి. వీటిని తొలగించాలంటే ఎద్దులతో గుంటక తోలాలి. ఇందుకు రూ.1,000 తీసుకుంటారు.

అంత సొమ్ము పెట్టలేని రైతు శనివారం తను పెంచుకుంటున్న పొట్టేలును అరకకు కట్టి గుంటక తోలాడు. పొట్టేలు ముందు కుమారుడు గడ్డి చూపిస్తూ వెళ్తుంటే.. ఆ ఆశతో అది గుంటక లాగుతుండటం పలువురిని ఆకట్టుకుంది. తాను పేద రైతునని, ఎద్దులు కొనే స్థోమత లేక ఇలా సాగు చేసుకుంటున్నానని రంజాన్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు