ఓ సామాన్య రైతు విజయగాథ.. నెలకు రూ.1.50 లక్షల ఆదాయం

6 Sep, 2021 14:44 IST|Sakshi

కరోనా విసిరిన సవాళ్లకు దీటైన జవాబు 

విత్తనాల తయారీలో స్వయం ప్రతిపత్తి 

మిల్కీ మష్రూమ్స్‌ తయారీతో నెలకు రూ.1.50 లక్షల ఆదాయం 

ఓ సామాన్య రైతు విజయగాథ  

నాతవరం( విశాఖపట్నం): ఓ రైతు సంకల్పానికి ప్రభుత్వ సాయం తోడ్పడింది. కరోనా విసిరిన సవాళ్లతో వారి కృషి మరింత రాటు దేలింది. ఇప్పుడు వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన ఓ సామాన్య రైతు విజయగాథ ఇది. వెదురుపల్లి గ్రామానికి చెందిన చిత్రాడ వెంకటేశ్వరరావుకు చిన్నప్పట్నుంచీ పుట్టగొడుగుల పెంపకం అంటే అమితాసక్తి.

పుట్టగొడుగుల (మష్రూమ్స్‌) ఉత్పత్తిపై అవగాహన పెంచుకున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న 26 సెంట్ల భూమిలో 2018లో శ్రీతులసి పుట్టగొడుగుల యూనిట్‌ ఏర్పాటు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రుణం ఇచ్చేందుకు  బ్యాంకర్లు నిరాకరించడంతో వడ్డీలకు అప్పు చేసి యూనిట్‌ ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరు నుంచి విత్తనాలు కొనుగోలు చేసి స్ధానికంగా లభ్యమయ్యే వ్యవసాయ వ్యర్ధాలతో తన కుమారుడు దుర్గాప్రసాద్‌ సాయంతో 2019లో పాల రకం పుట్టగొడుగుల (మిల్కీ మష్రూమ్స్‌) పెంపకాన్ని ప్రారంభించారు. మొదట్లో రోజుకు 20 కేజీల పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి విక్రయాలు చేసేవారు.

వీరి పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకున్న ఉద్యానవనశాఖ అధికారులు యూనిట్‌ను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ద్వారా రాయితీపై రుణం ఇస్తామని అధికారులు సూచించారు. వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్‌ యూనిట్‌ ఏర్పాటు కావలసిన డీపీఆర్‌ తయారు చేసి ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబదీ్ధకరణ పథకంలో రుణానికి దరఖాస్తు చేసారు. ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసి దాంట్లో రూ.8 లక్షలు (40 శాతం) రాయితీని ఇచి్చంది. ప్రభుత్వ సాయంతో ఇప్పుడు నెలకు సరాసరి 1000 కేజీల పుట్టగొడుగులు తయారు చేస్తున్నారు.

వీటిని విశాఖపట్నం, నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలలో ఉన్న హోల్‌సేల్‌ షాపులకు సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి కేజీ ఒక్కంటికి రూ 200 నుంచి 220 వరకు విక్రయాలు చేస్తున్నారు. పెట్టుబడితోపాటు కూలి సొమ్ము పోగా నెలకు లక్షా 50 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని దుర్గాప్రసాద్‌ చెప్పారు.   

విత్తనాల తయారీ యూనిట్‌ ఏర్పాటు  
మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా  కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా  కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నారు.

ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న  వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్‌ విత్తనాలు తయారు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. 

విత్తనాల తయారీ యూనిట్‌ ఏర్పాటు  
మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా  కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా  కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు.

తమిళనాడుకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న  వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్‌ విత్తనాలు తయారు చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. 

చదవండి: పరుగులు తీసి.. ప్రాణం కాపాడి..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు