టమాటా ‘ధర’హాసం

2 May, 2022 11:27 IST|Sakshi

లావేరు: టమాటా ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల కిందట కిలో రూ.20 ఉండగా ఆదివారం నాటికి రూ.60కు చేరింది. పది రోజుల వ్యవధిలోనే ఇంతలా ధర పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాము టమాటా పంట పండించిన సమయంలో కిలో రూ.8 నుంచి రూ.10వరకు ఉందని, ఇప్పుడు రూ.60కి చేరిన సమయంలో తమ వద్ద పంట లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌ అవుతుండటం వల్లనే టమాటా పంటకు ధర ఉండటం లేదని, రైతులు వద్ద లేని సమయంలో మంచి ధర ఉంటోందని అంటున్నారు.     

(చదవండి: పూజించారు.. పట్టుకుపోయారు)

మరిన్ని వార్తలు