నెల్లూరులో ఇసుక దుమారం: రైతులపై టీడీపీ నేతల దౌర్జన్యం

25 Jun, 2021 16:45 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని సర్వేపల్లిలో టీడీపీ నేతల పర్యటనను రైతులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమ మైనింగ్‌ ఎక్కడ జరిగిందో చూపించాలని టీడీపీ నేతలను రైతులు నిలదీశారు. తమ పొలాలకు సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి మట్టిని తోలుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే, టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే ప్రశ్నించిన రైతులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలను అడ్డుకోబోయిన దళిత సర్పంచ్‌పై దౌర్జన్యానికి దిగారు.

కాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దుమారం రేగింది. పెన్నా ఇసుక రీచ్ నుంచి అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీ చేశారని టీడీపీ ఆరోపించడంతో పెన్నా ఇసుక రీచ్‌లో అఖిలపక్షం పర్యటించింది.  మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు చేసి.. పేదల ఇండ్ల స్థలాల్లో తువ్వ ఇసుక నింపామని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని అఖిలపక్షాన్ని మంత్రి కోరారు. పెన్నా నదిలో ఇసుక తీసిన గుంటలను పరిశీలించిన అఖిలపక్షం నేతలు.. జీరో వాల్యూ ఇసుక మాత్రమే జగన్నన్న కాలనీల ఫిల్లింగ్ కి తరలించారని స్పష్టం చేశారు. టీడీపీ మాత్రం అదే మొండి ఆరోపణలు వినిపిస్తోందని, ఒక దశలో టీడీపీ నేతల వైఖరి పట్ల మిగిలిన పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివాదం చేయడం కోసమే ఆరోపణలు చేయవద్దని టీడీపీ నేతలకు సూచించారు.

చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్‌
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు