దారుణం : కన్నకూతురుపై తండ్రి లైంగిక దాడి

13 Aug, 2020 14:06 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. తుఫాన్‌నగర్‌కు చెందిన కోటేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. కొద్ది రోజులుగా చిన్న కూతురుపై కన్నేసిన కాసాయి తండ్రి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతంలో కూడా ఇలానే పెద్ద కూతురుపై అత్యాచారం చేసి కటకటాలు పాలైనా బుద్ది మారలేదని స్థానికులు పేర్కొన్నారు. కన్న కూతురిపైనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన కోటేశ్వరరావు ను కఠినంగా శిక్షించాలని బందువులు కోరారు. ఇలాంటి వ్యక్తులను సమాజం నుంచి తరిమేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు