22/02/2022: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. 

22 Feb, 2022 07:13 IST|Sakshi

సాక్షి, అనంతపురం: క్యాలెండర్‌లో 365 రోజులున్నా కొన్ని అరుదైన రోజులు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి అరుదైన రోజు మంగళవారం రానే వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ రోజు తేదీ 22. 2వ నెల. 22వ సంవత్సరం. మొత్తం కలిపి చూసుకుంటే 22.2.22ని సూచిస్తుంది. వికటకవిలా ఎటు నుంచి చూసినా ఒక్కటిగానే కనిపిస్తోంది కదూ! అందుకే ఈ రోజు ప్రత్యేక జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ తేదీకి సంబంధించిన ఫొటోలు, సినిమా పాటలు.. నెట్టింట వైరల్‌ అవుతుండడం గమనార్హం.   

మరిన్ని వార్తలు