అనవసర వ్యయం వద్దు: ఏపీ ఆర్ధికశాఖ

31 Mar, 2021 09:37 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలు 

ఓటాన్‌ అకౌంట్‌లో కేటాయింపుల మేరకే పనుల బిల్లులు  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నేపథ్యంలో అనవసర వ్యయాన్ని కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆర్ధికశాఖ సూచించింది. కోవిడ్‌ వల్ల ఆదాయ వనరులు తగ్గిపోయినందున ప్రాధాన్యతలను గుర్తించి ఆ రంగాలకే వ్యయం చేయాలని ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

ఓటాన్‌ అకౌంట్‌ కేటాయింపుల మేరకే పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని, కేటాయింపుల్లేని పనులకు బిల్లులను సమర్పించరాదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ చివరి వరకు ‘ఓటాన్‌ అకౌంట్‌’లో తిరిగి కేటాయింపులకు అనుమతించేది లేదన్నారు. వేతనాలు, పెన్షన్‌లు, గౌరవ వేతనాలు తదితరాలకు నియంత్రణ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. 

మరిన్ని వార్తలు