YSR Bima: నేడు వైఎస్సార్‌ బీమా లబ్ధిదారులకు ఆర్థిక సాయం

31 Mar, 2021 05:14 IST|Sakshi

సర్వేలో గుర్తించి, పథకంలో నమోదు చేసుకోకముందే మరణించిన వారికీ సాయం 

12,039 మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.254 కోట్లు జమ చేయనున్న సీఎం

సాక్షి, అమరావతి: అనుకోని విపత్తుగా ఇంటి పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారికి కూడా బీమా సొమ్మును చెల్లించడానికి సీఎం మానవతాదృక్పథంతో నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు 2020 అక్టోబర్‌ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 254 కోట్లు చెల్లించనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.  

మరిన్ని వార్తలు