సొసైటీలో అక్రమాలు.. టీడీపీ నేతపై కేసు

28 Aug, 2020 15:48 IST|Sakshi

సాక్షి, కాకినాడ : డీసీసీబీ మాజీ ఛైర్మన్, ప్రత్తిపాడు టీడీపీ నేత వరుపుల రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత టీడీపీ పాలనలో తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ వ్యవసాయ పరపతి సంఘంలో రైతు రుణాల పేరుతో రూ. 16 కోట్ల 50 లక్షల నిధులు అక్రమాలు జరిగినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. లంపకలోవ సోసైటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయాని గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. అధికారుల విచారణలో దిమ్మతిరిగే అవినీతి వాస్తవాలు వెల్లడయ్యాయి. (దృఢ సంకల్పంతో ముందడుగు: సీఎం జగన్‌)

చనిపోయిన రైతులు పేరు మీద సోసైటీలో రైతులకు తెలియకుండా స్వల్పకాలిక పంట రుణాలను కాజేసినట్లు గుర్తించారు. అధికారం అడ్డుపెట్టుకుని 450 నకిలీ పాస్ పుస్తాకాలను తయారు చేసి వాటితోను రుణాలను కాజేశారు. ఈ అవినీతి అక్రమాలకు కారకులుగా వరుపుల రాజా తో పాటుగా... అప్పటి సొసైటీ ఉద్యోగులపై విచారణా అధికారి రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు వరుపుల రాజాతో పాటుగా నలుగురు మాజీ ఉద్యోగులపై ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు