విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

25 Dec, 2021 09:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ద్రవరూప స్టీల్ నేల పాలయ్యింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్టీలు ప్లాంట్‌ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. నష్టం తీవ్రత అంచనా వేయాల్సి ఉంది. అలాగే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు