పలమనేరు నుంచి లద్ధాక్‌కు సాహస యాత్ర చేసిన తొలి కపుల్‌ బైక్‌ రైడర్‌గా రికార్డు

9 Aug, 2021 08:53 IST|Sakshi

 పలమనేరు నుంచి లద్ధాక్‌కు సాహస యాత్ర చేసిన దంపతులు 

తొలి కఫుల్‌ బైక్‌ రైడర్‌గా రికార్డు

37 రోజులు, 11,500 కి.మీ ప్రయాణం

నిత్యం బైక్‌లపైనే తిరిగే ఉద్యోగం కావడమేమో గానీ.. ఆ యువకుడు బైక్‌ రైడింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు.. అందుకు సంబంధించి వీడియోలను యూట్యూబ్‌లో చూడటం మొదలెట్టాడు. అలా  రాష్ట్రం నుంచి బైక్‌ రైడింగ్‌ చేసే సుమారు 20 మంది వ్లాగ్‌లను యూట్యూబ్‌లో గమనిస్తూ వచ్చాడు. అయితే వారంతా ఒంటరిగానే బైక్‌ రైడింగ్‌ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 12 మంది లద్ధాక్‌ ఒంటరిగానే వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో తను భార్యతో కలిసి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన అతనికి వచ్చింది.. వెంటనే భార్యకు ఆ విషయం చెప్పాడు. మొదట ఒకింత భయపడ్డా.. భర్త ఉత్సాహానికి ముచ్చట పడుతూ ఓకే చెప్పేసింది.. లద్ధాక్‌ వెళ్లొచ్చింది.
పలమనేరు: మండలంలోని అప్పినపల్లెకు చెందిన రంపాల రమేష్‌ అదే మండలంలోని ఓ ప్రైవేట్‌ డె యిరీలో ఐటీ సలహాదారు. అతని భార్య తులసీకుమారి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు గత నెల రెండో తేదీన తమ యమహా ఎఫ్‌జీఎస్‌ వీ3 బైక్‌ పై తమ సాహస యాత్రను ప్రారంభించారు. పలమనేరు నుంచి హైదరాబాద్, నాగ్‌పూర్, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ, పానిపట్, అంబాలా, పతన్‌కోట్, జమ్మూ, పత్నిటాప్, సింథన్‌టాప్, అనంత్‌నాగ్, శ్రీనగర్, దాల్‌ సరస్సు, కార్గిల్, లేహ్, వారిల్లాపాస్, చెంగాలాటాప్, లద్ధాక్‌ దాకా  ప్రయాణం సాగించారు. మార్గం మధ్యలోని పుణ్య స్థలాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సందర్శిస్తూ వెళ్లారు.  
అక్కడి నుంచే కష్టాలు  
జమ్మూ బోర్డర్‌ వరకూ వీరి ప్రయాణం సాఫీగానే సాగినా.. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. విపరీతమైన చలి వాతావరణం, కొండ మార్గాలు, లోయలు, సముద్ర మట్టానికి 982 అడుగుల ఎత్తు లో ప్రయాణం.. అయినా పట్టువదలకుండా తమ ప్రయాణాన్ని సాగించి ఎట్టకేలకు లద్ధాక్‌ చేరారు. అక్కడి ప్రజలు వీరిపై ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. అక్కడ లాడ్జిలు, హోటళ్ల వంటివి ఉండ వు. స్థానికులే ప్రయాణికులకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ జంటకు కూడా ఆశ్రయం ఇచ్చి తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని రమేష్‌ దంపతులు చెప్పారు. ఆ తర్వాత అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తమ యాత్రలోని రోజువారి విశేషాలను ‘రమేష్‌ రంపాల ఫస్ట్‌ కపుల్‌ రైడర్‌ ఫ్రం చిత్తూరు’ అనే వ్లాగ్‌లో పోస్ట్‌ చేస్తూ వచ్చారు. తమ యాత్రను విజయవంతంగా ముగించుకుని ఆదివారం వీరు స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో వీరికి రూ.2 లక్షల దాకా ఖర్చు చేశారు. లడక్‌ వెళ్లి రావడానికి వీరికి 37 రోజుల సమయం పట్టింది. మొత్తం 11,500 కి.మీ ప్రయాణించారు.  
గ్రామస్తుల సత్కారం  
ఈ జంట లద్ధాక్‌కు బైక్‌పై వెళ్లి వస్తున్నారని తెలిసి అప్పినపల్లె్ల గ్రామస్తులు ఆలయంలో వీరి పేరున ప్ర త్యేక పూజలు చేయించారు. అనంతరం రమేష్, తులసీకుమారి జంటను సన్మానించారు. పలమనేరు నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చారంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ వీరికి అభినందనలు తెలిపా రు. ఇండియా–పాక్‌ సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఒకింత ఆందోళన చెందామని, అక్క డి ప్రజలు ప్రేమానురాగాలు చూపినట్టు తెలిపారు. ఈ యాత్ర ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసిన ట్టు రమేష్, తులసీకుమారి దంపతులు చెప్పారు.   

మరిన్ని వార్తలు