వింత వ్యాధితో ఐదుగురు గిరిజనుల మృతి 

18 Sep, 2020 10:19 IST|Sakshi
గిరిజనులను అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్న దృశ్యం

తక్షణం స్పందించిన ప్రభుత్వం..

విశాఖ కేజీహెచ్‌కు 18 మంది తరలింపు 

అనంతగిరి (అరకులోయ): విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ కరకవలస, చినరాబ గ్రామాల్లో మూడు వారాలు వ్యవధిలోని వింత వ్యాధితో ఐదుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు. దీనిపై అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్పందించి అధికారులతో మాట్లాడారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు బుధవారం ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌ గ్రామాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించి, వింత వ్యాధి (కాళ్లు, చేతుల వాపులు)కి గల కారణాలపై ఆరా తీశారు. గురువారం ఉదయం వైద్య సిబ్బంది గ్రామాలకు చేరుకుని మూడు అంబులెన్స్‌లో కరకవలస, సొట్టడివలస, చినరాభ గ్రామాలకు చెందిన 18 మంది గిరిజనులను గజపతినగరం తరలించారు.  వీరందరికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ముందుస్తు చర్యల్లో భాగంగా వీరందరని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. 

నిల్వ పశు మాంసమే కారణమా? 
నిల్వ పశు మాంసం తీసుకోవడంతో కరకవలస వాసులు అనారోగ్యం పాలవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఏ కారణంతో మరణాలు సంభవిస్తున్నాయి? కాళ్లు, చేతుల వాపులు ఎందుకు వస్తున్నాయనే దానిపై పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కాని చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు