విజయవాడ: నేటి నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్‌ 

7 Sep, 2021 07:37 IST|Sakshi

విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి ఒమన్‌ దేశ రాజధాని మస్కట్‌కు ఎయిర్‌ ఇండియా సంస్థ మంగళవారం నుంచి విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. వారానికి ఒక సర్వీస్‌ మాత్రమే నడుస్తుంది. ఈ విమాన సర్వీస్‌ ద్వారా ఇక్కడి నుంచి మస్కట్‌కు కేవలం 3.30 గంటలలోనే చేరుకోవచ్చు. 182 మంది ప్రయాణికుల సామార్ధ్యం కలిగిన ఎయిర్‌బస్‌ ఎ–321 విమానం ప్రతి మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్ట్‌గా మస్కట్‌కు బయలుదేరి వెళ్తుంది. మస్కట్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.

ఇవీ చదవండి:
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!
‘రోడ్డు’ మ్యాప్‌ రెడీ 

మరిన్ని వార్తలు