పొగమంచు.. గంట నుంచి గాల్లోనే విమానం చక్కర్లు

27 Feb, 2021 11:19 IST|Sakshi

విజయవాడ: గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్‌కు అధికారులు సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో గంట నుంచి స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ ఇండియా విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. 67 మంది ప్రయాణికులతో స్పైస్‌ జెట్ SG3417 విమానం బెంగుళూరు నుంచి గన్నవరంకు వచ్చింది. అయితే ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడటంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది. 

ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయ్‌ర్‌ ఇండియా విమానం సైతం పొగమంచు కారణంగా ల్యాండింగ్‌ అవ్వలేదు. దీంతో ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ రెండు విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. సుమారు గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం గన్నవరం ఎయర్‌పోర్ట్‌లో రెండు విమానాలు సురక్షితంగా ల్యాండ్‌  అయ్యాయి.  దాదాపు 4 రౌండ్లు అనంతరం​  ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరంలో ల్యాండ్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు