‘క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఫలితాలు కీలకం’

31 Jul, 2022 17:00 IST|Sakshi

అనంతపురం: అనంతపురంలో రీజనల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభమైంది. ల్యాబ్‌ను హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెంమంత్రి మాట్లాడుతూ, క్రిమినల్‌ కేసులు ఛేదించటంలో ఫోరెన్సిక్‌ ఫలితాలే కీలకమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా పోలీసులు క్షణాల్లో స్పందించేలా వ్యవస్థలో మార్పు తెచ్చామని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలవుతుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కృషి వల్లే దిశా చట్టం తెచ్చామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.

 

మరిన్ని వార్తలు