ఆత్మీయ అతిథులకు అటవీ ఉత్పత్తులు

3 Mar, 2023 04:07 IST|Sakshi

 ప్రముఖుల కోసం 200 కిట్లను సిద్ధం చేసిన అధికారులు 

అరకు కాఫీ, గిరిజన తేనె, హెర్బల్‌ ఆయిల్, పెయిన్‌ రిలీఫ్‌ ఆయిల్‌  

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టిస్తూ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా దేశ విదేశీ ప్రముఖులకు ఆత్మీయ ఆతిథ్యంతోపాటు మధుర స్మృతులను మిగిల్చే కానుకలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక జ్ఞాపికల కిట్స్‌తో పాటు గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తుల కిట్లను కూడా అందించనున్నారు.

జీఐఎస్‌ సదస్సుకు దాదాపు 3 వేల మంది ప్రముఖులతో కలిపి మొత్తం 8 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ కలకాలం గుర్తుండే ఆ­తి­థ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ జ్ఞాపకాల్ని తమతో మోసుకెళ్లేలా ప్రత్యే­క కానుకలు అందించనున్నారు. స్వచ్ఛమైన ప్రేమను పంచే గిరిజనులు సేకరించిన కల్తీ లేని ఉత్పత్తులను కానుకగా ఇవ్వనున్నారు.

నాణ్యమైన జీసీసీ ఉత్పత్తుల్ని దేశ విదేశీ ప్రముఖులకు పరి­చయం చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్లు జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, జీసీసీ ఎండీ సురేష్‌కుమార్‌ తెలిపారు.  ఈ సమ్మిట్‌కు హాజరైన ప్రముఖులకు జీసీసీ గిఫ్ట్స్‌ను అందించనున్నారు. ఇందుకోసం 200 కిట్లను జీసీసీ సిద్ధం చేసింది. నాణ్యమైన తేనె, హెర్బల్‌ ఆయిల్, పెయిన్‌ రిలీఫ్‌ నుంచి అరకు కాఫీ వరకూ 12 రకాల జీసీసీ ఉత్పత్తులు ఈ కిట్లలో   ఉంటాయి. 

మరిన్ని వార్తలు