మాజీ డిప్యూటీ స్పీకర్‌ కుతూహలమ్మ కన్నుమూత

15 Feb, 2023 12:11 IST|Sakshi

సాక్షి, తిరుపతి: మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 1980-83లో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఆమె పనిచేశారు. 1985-89లో వేపంజేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు.

1991-92లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 1992-93లో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో నియోజకవర్గాలు పునర్విభజన కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. 2007-09లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు.
చదవండి: AP: హైకోర్టులో ‘ఈనాడు’కి ఎదురుదెబ్బ..

సీఎం సంతాపం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరిన్ని వార్తలు