మాజీ మంత్రి ఆదికి హైకోర్టులో ఎదురుదెబ్బ  

12 Aug, 2020 08:08 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకున్న 1+1 భద్రతను తొలగించడాన్ని సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రాణహాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్న సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.   (విజయవాడ ఘటనపై స్పందించరేం బాబూ?)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా