మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

7 May, 2022 07:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం  శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు.
చదవండి: ఉత్తరాంధ్రపై మరోసారి అక్కసు వెల్లగక్కిన చంద్రబాబు

1994-99లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పని చేశారు. 2004-09లో కాంగ్రెస్ నేత ఎస్‌సివి నాయుడు చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు