ముగిసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ అంత్యక్రియలు

5 Oct, 2020 16:00 IST|Sakshi

సాక్షి, విశాఖ: ప్రభుత్వ లాంఛనాలతో ఉత్తరాంధ్ర సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. కాన్వెంట్ జంక్షన్‌ సమీపంలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు డాక్టర్స్ కాలనీలో మొదలైన ద్రోణంరాజు అంతిమయాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్స్ కాలనీ, సిరిపురం జంక్షన్, జగదాంబ జంక్షన్, పూర్ణ మార్కెట్, దుర్గమ్మ గుడి మీదుగా యాత్ర జ్ఞానాపురం స్మశాన వాటిక వరకు కొనసాగింది. (చదవండి: 'విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ')

ద్రోణంరాజు శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసంద‌ర్శించి పార్టీలకతీతంగా నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ద్రోణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు