AP New Cabinet Ministers: తండ్రి, తనయుడి కేబినెట్‌లలో ఆ నలుగురు.. 

12 Apr, 2022 08:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇక తండ్రీ, తనయుల మంత్రివర్గాల్లో చోటు దక్కించుకుని, పనిచేయడం అరుదు. తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్‌లు పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలోనూ ఈ నలుగురు స్థానం దక్కించుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

అలాగే, వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీశాఖ, ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖలు దక్కించుకున్నారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్, గనులు భూగర్భవనరులతోపాటు అటవీశాఖను దక్కించుకోగా... ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. తండ్రీ, తనయుల మంత్రివర్గంలో ఒకే శాఖను దక్కించుకున్న మరో అరుదైన రికార్డును కూడా వీరు సొంతం చేసుకున్నారు. ఇక సోమవారం ప్రమాణస్వీకారం చేసిన 25 మందిలో 13 మంది తొలిసారి మంత్రులయ్యారు.

చదవండి: (శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్‌.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం)

మరిన్ని వార్తలు