విషాదం: పెన్నానదిలో నలుగురు గల్లంతు

24 Jun, 2021 18:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గల్లంతైనవారిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి యువకులు ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. గల్లంతైనవారిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కడపలోని బెల్లంమండి వాసులుగా గుర్తించారు.

చదవండి: మాన్సాస్‌ భూముల వ్యవహారంపై విచారణ
మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం

మరిన్ని వార్తలు