టీటీడీ ఉద్యోగాల పేరుతో మోసం 

11 Sep, 2022 04:49 IST|Sakshi
ప్రధాన నిందితుడు బాలకృష్ణ

నిందితుడిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు

నకిలీ స్టాంప్‌లు, ఫోర్జరీ పత్రాలు స్వాధీనం   

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ వింగ్‌ ఏవీఎస్‌వో పద్మనాభన్‌ తెలిపిన వివరాలు.. తిరుపతిలోని కొరమేను గుంటకు చెందిన బాలకృష్ణ టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు.

ఈ విధంగా దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన తర్వాత.. వారికి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా ఇచ్చేవాడు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్‌ అధికారుల దృష్టికి రావడంతో.. వారు ప్రధాన నిందితుడైన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నకిలీ నియామక పత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు