100 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు

16 Nov, 2021 04:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: పునర్జీవితాన్ని ప్రసాదిస్తాం అనే పేరుతో 100 మంది చిన్నారులకు వివిధ రకాలైన ఉచిత శస్త్ర చికిత్సలు చేసే కార్యక్రమాన్ని ఆస్టర్‌ ఆస్పత్రి యాజమాన్యం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం ప్రారంభించింది. నవంబర్‌ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ ఆస్టర్‌ ఆస్పత్రుల రీజనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కె.టి.దేవానంద్‌ లాంఛనంగా ప్రారంభించారు.

12 సంవత్సరాల్లోపు వయసు కలిగిన 100 మంది నిరుపేద చిన్నారులకు ఏడాది కాలం ఉచితంగా చికిత్స నిర్వహించనున్నట్టు తెలిపారు. అపెండిసైటిస్, పీడియాట్రిక్, యూరాలజీ శస్త్ర చికిత్సలతో పాటు, కాలేయ మార్పిడి, గుండె సంబంధిత, వివిధ రకాల చికిత్సలు చేస్తున్నట్టు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు