ప్రగతిని వివరిస్తూ.. సమస్యలు తీరుస్తూ

25 May, 2022 05:23 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో లబ్ధిదారులకు సంక్షేమాన్ని వివరిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ఉత్సాహంగా సాగుతున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం’

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మూడేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ.. ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజు మంగళవారం ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. నేతలకు ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఈ ప్రభుత్వంలో తమకు కలిగిన లబ్ధిని వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు అక్కడే ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడుతున్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు వెంటనే తీరుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు